అదేనండి మీ(మా/మన) బ్లాగు పుస్తకం. సుజాత గారు, రహ్మాన్ గారు, కిరణ్ చావ గారు రాసిన బ్లాగు పుస్తకం
ప్రతి ప్రొగ్రామింగ్ లేంగ్వెజ్ బుక్ ప్రారంభం అయినట్టే 'హెల్లొ వొర్ల్డ్' ప్రొగ్రాం తో మొదలవుతుంది. తరువాత ఎందుకు ఏమిటి ఎలా అని వివరిస్తూ వెళ్తుంది. వ్యాఖ్యల నిర్వహణ, అమరికలు , అలంకరణలు, సంకలినులు ఇలా అన్నింటి గురించి చక్కగ వివరించి, స్క్రిన్ షాట్స్ తొ సహా ఉన్న ఈ పుస్తకం కొత్తవారికి బాగ ఉపయోగ పడుతుంది. రచయితల ఈ ప్రయత్నాన్ని అభినందించ కుండా ఉండలేం.

ఆదివారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ముఖ్య అతిథి అనగా నేను వెళ్ళకుండానే కార్యక్రమం మొదలైపొవడం కాస్త నిరాశ కలిగించింది. ఈ విషయం పట్ల నా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమరణ నిరాహారదీక్ష మొదలెట్టాను. నిర్వాహకులతో, రచయితలతో పలు దఫాలు చర్చల తరువాత కాస్త నెమ్మదించవలసిన అవసరం ఏర్పడినది. భవిష్యత్తులో ఇదే రచయితలు రాయబోయే బ్లాగు పుస్తకం-2 (కంప్లిట్ రెఫెరెన్స్) నా చేతుల మీదుగా ఆవిష్కరింప బడుతుంది అని లిఖిత పూర్వక హామి ఇవ్వటం మూలాన నిరసన విరమించుటకు ఏకాభిప్రాయం కుదిరింది. దింతో నిర్వాహకులు ముఖ్యంగా చావ కిరణ్ గారు తేనీరు ఇచ్చి నిరసన విరమింపచేసారు.
(కార్యక్రమం గురించి చివరి నిమిషం లో నాకు తెలియటం వల్ల నేను చేరుకోవటం ఆలస్యం అయింది )
నాగార్జున, చాణక్య, అశ్విన్, వీవెన్ గారు, తాడేపల్లి గారు, అనిల్ గారు, శ్రీనివాస్ గారు, సోమశేఖర్ గారు, వరుధిని గారు, మాల గారు, పి.ఎస్.ఎం లక్ష్మి గారు, ఉమాదేవి గారు, భాగ్యలక్ష్మి గారు మొదలైన పెద్దలు(మొదటి ముగ్గరు కాదు ) + బ్లాగర్లు కలుసుకోవటం చాల ఆనందం కలిగించింది. బ్లాగుల పైన అందరు తమ అభిప్రాయాలు, అనుభవాలు పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో పరిచయం అయిన చిన్ని నేస్తం నాకు ఇచ్చిన అతి పెద్ద బహుమతి.
నేస్తం ఎవరో ఏమిటొ చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా :)మరొక్క సారి సుజాత గారికి, రెహ్మాన్ గారికి, చావ కిరణ్ గారికి అభినందనలు
7 comments:
బాగా ఎంజాయ్ చేశారన్న మాట.. ;)
గిఫ్ట్ కేక మాష్టారూ.. ;)
మరిచి పోయా...
ఎల్కం బ్యాక్...;)
బంతి ...welcome బ్యాక్ :)
పోస్ట్ బాగుంది ...పుస్తకం కూడా...చదివాను లే..
:)
"నేస్తం ఎవరో ఏమిటొ చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా :)"
లేదని ఎవరన్నారు? ఉంది. మాకు కరాటే కిక్‌లు, మీకు గిఫ్ట్‌లా? అస్సలేం బాలేదు.
Nice !
గమనిక: లడ్డూలు, జంతికలు లేకుండా కార్యక్రమానికి విచ్చేసిన వరూధిని గారికి, కార్యక్రమం చివర మిరపకాయ బజ్జిలు అని గుర్తు చేసి ఇప్పించ కుండా తప్పించుకున్న సుజాత గారికి మా నిరసన తెలియజేస్తున్నాం.
LOL
Welcome back chaitanya :)
Post a Comment