గోళీ ఈ మాట వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది. రోమాలు నిక్క బొడుచుకుంటాయి. ఇంకా ఆది సినిమాలో ఎన్.టి.ఆర్ సీమ లో నీళ్ళు తాగితే గొంతు ఎర్రగా మారి పౌరుషం తన్నుక వస్తుంది చూడండి అలా, పొందూరు ఖద్దరు వేసిన బాలయ్యలా గోళీ అంటే నాకు ఏదేదో అయిపోతుంది. గోళీలు కనుక ఒలింపిక్స్ లో పెట్టి ఉంటే First to last అన్నిమెడల్స్ నేను మా ఫణి గాడు క్లీన్ స్వీప్ చెసేవాళ్ళం. కాని విదేశీ కుట్ర ల మూలంగా ముఖ్యంగా CIA, KGB, ISI ల కుట్ర ఫలితంగా మా టాలెంట్ అణచి వేయబడింది. లేదంటే 90ల్లోనే ఇండియాకు గోళీల్లొ గోల్డ్ తెచ్చేవాళ్ళం.
నేను ఫణి ఒకే వీధిలో ఎదురెదురు ఇళ్ళలో ఉండేవాళ్ళం. ఇద్దరం 4 తరగతి ఒకే స్కూల్ లో చదివేవాళ్ళం. మాకు ఇంకో పేరు కూడా(భాషాలో లా ) గోళీ బ్రదర్స్. చుట్టు పక్కల 4 , 5 వీధుల్లో ఎవరికి మాకు ఉన్నంత ప్రావీణ్యం గోళీల్లో ఉండేది కాదు. రెండు గోళీ లతో వెళితే 200 గోళీ లతో వచ్చేవాళ్ళం. ఇంటికి తెచ్చి వెదురు బుట్టలో వెసేవాళ్ళం. ఒక square గీసి అందులో గోళీ లు పెట్టి, అక్కడనుంచి గోళీ విసిరితే ఎవరిది దగ్గర పడితే వాళ్ళే ముందు square లో ఉన్న గోళీ బయటకు వచ్చేలా ఒక్క సారిగా గోళీతో కొట్టాలి. దీని పేరు డిం. ఇంకా గోళీలు అన్ని వరుసగా పెట్టి ఎదుటివాడు చెప్పిన గోళీ ఆ వరుసలోనిది కొట్టాలి. కొడితే ఆ వరుసలోని గోళీలంతా వాడికే. దీని పేరు సెట్. సెట్ అయిన, డిం అయిన ఇరగదీసేవాళ్ళం.
అవి మా గోళీ సామ్రాజ్యం విస్తరిస్తున్న రోజులు. ఒక రోజు మా వీధిలోకి కొత్తగా ఒక ఫ్యామిలి వచ్చారు. వాళ్ళకో అమ్మాయి. పేరు ధరణి. ఈ అమ్మాయి 5 తరగతి. మాకన్న సంవత్సరం పెద్ద. ఎప్పుడు రెండు జడలు వేసుకొనేది. ఒకరోజు సాయంత్రం బాగా తిని నేను ఫణి గాడు వీధిలోకి వచ్చి గోళీలు ఇరగదీస్తున్నం. అంతలో ధరణి వచ్చి రేయ్ నేను వస్తా అంది. రావడంతోనే రేయ్ అనడంతో మా ఇగో కాస్త దెబ్బతింది. అయిన సర్దుకొని రా అన్నాం. డిం ఆడాం 5 గోళీ లు కొట్టేసింది, సెట్ ఆడాం 10 పోయింది. అలా మా గోళీ లు అన్ని కొట్టేసి తన ఫ్రాక్ జేబులు నింపుకుంది. మొదటసారి ఓటమి. గోళీ బ్రదర్స్ ఓడిపోయారు. వీధి నివ్వెరపోయింది. ఓటమిని జీర్ణించుకోవడానికి ఓ వారం పట్టింది. తరువాత రోజు అలాగే ఏ ఆట అయిన మా గోళీ లు ఖాళి. ఇంట్లోకి వచ్చి బుట్టలో గోళీలు వేసి పోయేవాళ్ళం, ప్రతి పది నిమిషాలకు ఒకసారి వచ్చి బుట్టలోని గోళీలు జేబులో నింపుక వెళ్తున్నాం. ఏంచేసిన ఓడిపోతున్నాం. ఒక వారం గడిచింది. సగం బుట్ట ఖాళీ. మా గౌరవమర్యాదలు మంట కలిసాయి. మేము వెళ్తే 5,6 తరగతుల వాళ్ళు కూడ అన్న అనేవాళ్ళు. అలాంటిది మా పెద్దరికం అటకెక్కింది. మా ఆధిపత్యం అణచి వేయబడింది. అంతకన్న తీవ్రమైంది ఆ అమ్మాయి మమ్మల్ని తిట్టేది. ఫణిని పొట్టోడా అని, నన్ను సన్నోడా అని.
మేమిద్దరం ఆలొచించి ఒక నిర్ణయం తీసుకున్నాం . ఏలాగైన ఈ రోజు దెబ్బ కొట్టాలి అని. మాకు తెలీదు మేమే దెబ్బయిపోతాం అని. ధరణి రా అని పిలిచాం. ఏరా కొత్తగా గోళీలు కొన్నారా అంటూ వచ్చింది, వెళ్ళాం. డిం ఆడాం, సెట్ ఆడాం. లాభం లేదు మళ్ళీ గుండు కొట్టించింది. చివరికి 5 మిగిలాయి. ఈ సారి సెట్ పెట్టాం. అంటే 5 గోళీ లు వరుసగా పెట్టీ చెప్పింది కొట్టాలి. నేను మా ఫణి గాడు మిస్ అయ్యం. చివరికి తన చాన్స్. మూడొది అన్న.. ఠక్కున కొట్టేసింది. అంతే మా ఫణి గాడు left నుంచి కాదు right నుంచి మూడోది అన్నాడు, నేను అవును తప్పు, గోళీ లు మాదే అన్న అంతే... ఒరేయ్ వెధవల్లరా పెట్టింది 5 ఎటునుంచి అయిన మూడోది అదేరా అని తిట్టింది. అంతే ఫణి గాడూ సైగ చేశాడు. నేను వెంటనే ధరణి రెండు జడలు పట్టుకొని కిందకు గట్టిగా గుంజా అంతే భూమి నుంచి మూరడున్న ఫణి గాడు రెండు మూరలు పైకి గాల్లోకి ఎగిరి వీపు మీద ఒకే ఒక గుద్దు గుద్దాడు. అంతే ఢాం.... వి.వి.వినాయక్ సినిమాలో హీరో కొడితే విలన్ కింద పడే లా ధరణి నేలకు కరుచుక పోయింది. గోళీ బ్రదర్సా ..మజాకానా. అంతే మేము ఇంటికి పారిపోయాం.
5 నిమిషాల్లొ యుద్ధం మొదలైంది. ధరణి వాళ్ళమ్మ మా ఇండ్ల మీద యుద్ధం ప్రకటించింది. ఫణి వాళ్ళ అమ్మా, మా అమ్మా సంయుక్తంగా కలిసి దాడిని ఎదుర్కొన్నారు. యుద్ధం తీవ్రం అయింది. మటల్లొ వాడి, వేడి పెరిగింది. వంశాలు వంశాలు మాటల్లొ దొర్లుతున్నాయి. కాసేపటికి సంయుక్త సైన్యం ధాటికి శత్రు సైన్యం తోక ముడిచింది. ధరణి వాళ్ళమ్మ ఇంటికి వెళ్ళింది. అంతే వీళ్ళూ మా వైపు ఉరుముతూ చూసారు. కీడు శంకించి మేము ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నాం, అయిన లాభం లేకపోయింది. సోఫా కింద, మంచం కింద, టి.వి స్టాండ్ వెనుక, అటక పైన ఎక్కడ దాక్కున్నా పట్టుకొని విరగదీసారు. కొట్టిన చోట కొట్టకుండా, మా ఒళ్ళు పులిసే వరకు , వాళ్ళ ఒళ్ళు అలిసే వరకు కొట్టారు. తరువాత.. ఇంకో సారి గోళీలు ఆడి గొడవలు తెచ్చారో అయిపోతారు అని వార్నింగ్ ఇచ్చారు. మరుసటి రోజు ఇద్దరం దెబ్బలకు మందు రాసుకుంటు ఆలోచించాం. హఠాత్తుగా ఫణి గాడు రేయి అమ్మా వాళ్ళూ ఏమన్నారు అని అడిగాడు. గోళీలాడి గొడవలు తెస్తే. అన్నా... అయితే మనం బొంగరాలు ఆడుదాం అన్నాడు.
అంతే..
పక్క వీధిలో ఉన్న మురళీ గాడి దగ్గరకు వెళ్ళి, ఒక బొంగరం గురుదక్షిణ గా సమర్పించుకొని రెండు రోజుల పాటు శ్రద్దాసక్తులతో, అకుంటిత దీక్షతో , భయం భక్తులతో బొంగరానికి తాడు చుట్టడం దగ్గరనుంచి, బొంగరాన్ని గాల్లోకి వేసి చేతిలో పట్టడం వరకు అన్ని అస్త్రశస్త్రాల్లో ఆరితేరాం. తరువాత ఏముంది అప్పటి నుంచి 3 బొంగరాలు, 6 గొడవలు గా వర్థిల్లాం. కాని ఈ సారి కూడా మాకు అన్యాయం జరిగింది, ఒలింపిక్స్ లో బొంగరాలు పెట్టలేదు.
32 comments:
సూపర్ గా రాసారు...
ఆఫీసు కాబట్టి హాయిగా నవ్వుకోలేకపోయాను... ఇంటికి వెళ్లి మల్లి చదువుతా :D
ఒరేయ్ వెధవల్లరా పెట్టింది 5 ఎటునుంచి అయిన మూడోది అదేరా అని తిట్టింది.
ఇది సూపరు :D
మీకు జరిగిన ఈ అన్యాయం పై శాస్త్రీయమైన విచారణ జరగాలి
హ హ్హ హ్హా బాగున్నాయి గోళీ కబుర్లు.
నాకు గోళీలంటే జైత్రయాత్ర సినిమా కూడా గుర్తొస్తుంది. :)
Super.
You may enjoy this one by Arudra.
http://www.thulika.net/2008June/3millionbet.html
Hi,
Bagundi post :)
Meeko vishayam cheppana?
Nenu kuda chinnapudu golillu adedanini,me antha kakapoyina edo parledu baane geliche danini :).
హ హ సూపర్ పోస్ట్ చైతన్య :) బాగా నవ్వించారు. ఎటునుంచైనా మూడోది సూపరు. ఎందుకో తెలీదు గానీ మనకి అంతగా గోళీలాటలో ప్రవేశం లేదు :)
బాగా రాశారు..
హన్నా ! ఎంత దౌర్జన్యం ఓడిపోయి మళ్ళా కొట్టటం
బాసూ!!
బెచ్చాలు గోళీల కాంబినేషన్ ఆడారా మీరెప్పుడైనా...:):)
బాగుంది నీ కత.
కేక....మీరు రాసిన తీరు బాగా నచ్చిందండి .....పదప్రయోగం సూపర్...చాల బాగా njoy చేశా.....కుళ్ళు తట్టుకోలేక ఆమెను కొట్టడం.....భలే వుంది మీ పోస్ట్......చిన్నప్పుడు నేనూ గోలీలు ఆడేదాన్ని..మీరు అయితే అన్ని ప్లేసులు క్లీన్ స్విప్ చేసేవారు నేనూ మాత్రం ultimate గా ఒకే ఒక్క ప్లేస్.....అదే ultimate ప్లేస్ (లాస్ట్ నుంచి ఫస్టు).....మనకు అంత ప్రావీణ్యం లేదులెండి..........సరే....చాలా బాగుంది
చైతన్య గారు ధన్యవాదాలు.
మనోహర్ గారు నేను అదే కోరుకుంటున్నాను. సిట్టింగ్ జడ్జ్ చేత విచారణ జరిపించాలి. మాకు న్యాయం జరగాలి.
జీడిపప్పు గారు కృతజ్ఞతలు.
కొత్తపాళి గారు చదివాను బాగుంది :)
karthika గారు ధన్యవాదాలు మీకు గోళీల్లో ప్రవేశం ఉందన్న మాట :)
వేణూ శ్రీకాంత్ గారు ధన్యవాదాలు. నాకు కనుక ఓ 100 గోళీలు ఇచ్చుకుంటే చిట్కాలు నేర్పుతా ఏమంటారు?
మురళి గారు కృతజ్ఞతలు.
Sravya గారు మరి మా గోళీలు అన్నీ కొట్టేస్తే కొట్టమా ఏంటీ :(
భాస్కర్ రామరాజు గారు బెచ్చాలు అంటే ఏమిటండీ .. కర్ర బిల్లనా
అనూ గారు ధన్యవాదాలు.
టపా బాగుంది. మీ పద ప్రయోగాలు ఇంకా బాగున్నాయి.
గోళీ బ్రదర్స్ ఓడిపోయారు. వీధి నివ్వెరపోయింది :)
ఇలా సెట్టులు, డిం లేనా అసలయిన గోలీలాట కూడా ఆడేవాళ్లా?
ఓరినీ ఎంకమ్మా!! అదికూడా తెలవదా? బెచ్చాలు అనగా, ఒక బల్లపరుపుగా అరచేయ్యంత ఉండే ఓ నాపరాయి. దాని అంచుల్ని పగలగొట్టి గుంద్రంగా చేస్కుని దానితో ఓకులు గోళీలు అణగగొట్టిన కూల్డ్రిఖ్ మూతలు గట్రా అడేవాళ్లం.
సిరిసిరిమువ్వ గారు ముందుగా ధన్యవాదాలు. సెట్, డిం కాకుండా ఇంకా గోళీలు కింద వేసి వేలితో కొడతారు అది ఆడేవాళ్ళం. ఇంకా చిన్న గుంత తీసి అందులో రెండు గోళీ లు వెయ్యాలి, ఎదుటి వాడు చెప్పిన గోళీ కొడితే లైన్ దగ్గర పెట్టిన డబ్బులు వాళ్ళకే . ఇందులో నా రికార్డ్ ఏంటంటే ఒకే రోజు రు. 3.50 గెల్చుకున్నా .
భాస్కర్ రామరాజు గారు ఒహ్ .. బెచ్చాలు అంటే అదా ! మా వైపు బిల్ల ఆట అంటాం. అది కూడ ఆడేవాడిని. కూల్డ్రింక్ మూతలే కాకుండా సిగరెట్ పెట్ట ముక్కలు.. ఇంక అగ్గిపెట్ట అట్టలు పెట్టి ఆడేవాళ్ళం.
బాసూ చైతన్యా, లాభంలేదోయ్, నీకు గీతోపదేసం సెయ్యాల్సిన్దే. సిరగెట్టు డాబ్బా కాయితకాలనే "ఓకులు" అందురు. :):) ఏంజాయ్ యువర్ డే.
సరే పనిలో పని, మీకు సమయం ఉంటే ఈడ ఓకాలు సెయ్యి, ఓ గోళీ బిళ్ల వెయ్యి http://paatapaatalu.blogspot.com/2009/01/blog-post.html
చైతన్యా ఎస్.. ఏవూరు మనది. అచ్చు మా వీదుల్లొ సీన్ లా వుంది? అంటె క్యెరక్టెర్స్ కాదు.. ఆటలు,వాటి పెర్లు బాగా మేచ్ అవుతున్నాయి
బాసూ నాకోసారి మెయిల్ ఇవ్వగలవా?
ఛీఛీ మెయిల్ ఐడీ ఇవ్వకుండానే మెయిల్ ఇవ్వమంటా ఏంటీ నామొహం
admin.websphere@gmail.com
very nice chala bagundhi....
Sirisha గారు ధన్యవాదాలు.
మంచు పల్లకీ గారు కొంపదీసి మనిద్దరం కలిసి కాని గోళీలు ఆడామా ఏంటి ??? :)
అయ్యో,ఇన్ని రోజులు ఇంత మంచి కథ మిస్ అయిపోయా....కథ మాత్రం సూపర్.
మీరు ఇంటికి తెచ్చి వెదురు బుట్టలో పోస్తే....నేను అంగడి వెదురు బుట్టలోవి తెచ్చి నా తోటి వాళ్ళ జేబులో పోసే వాడిని...ఓడిపోయి.......అయినా సరే .....ఘజినీలా ఎన్ని సార్లు దండ యాత్ర చేశాననీ.
ఈ రెండు ఆటలూ మేమూ ఆడే వాళ్ళం...పేర్లు మాత్రం తెలీదు....ఇపుడు తెలిసేసాయి. ధాంక్స్.
ఈ మధ్య మా హైదరాబాద్ లో గోలీలు ఏవో అలంకరణలలో తప్పితే పిల్లల చేతిల్లో, వీధుల దగ్గర కనపడట్లేదట ...ప్చ్.
సూపర్గా నచ్చేసింది కాబట్టి నా బ్లాగ్లో పెట్టుకుంటాను...హక్కులన్నీ మీవే...ఓకే నా?
(www.nemechchinaraatalu.blogspot.com)
హాయ్ ...మా పిచ్చికలు మంచి పని చేసాయి ...హమ్మో ..మీ గోలీలాట మిస్ అయ్యేదాన్ని కదూ .....పోనీలెండి నేను చదవడం లేట్ అయ్యిన మొత్తానికి మంచి టపా చదివాను ..చాల బాగుంది ..పాపం ధరణి .:)
భావకుడన్ గారు ముందుగా కృతజ్ఞతలు. ఘజినిలా దండయాత్రలు చేసారా :))
నిరభ్యంతరంగా పెట్టేసుకోండి నాకు డబుల్ ఓ.కె
చిన్ని గారు ధన్యవాదాలు. పాపం ధరణినా :( మా గోళీలు అన్ని కొట్టేసింది తను :(
chala chala chala baga rasaru... podhununchi pani lo padi chedipoyina burra mee tapa chadivi entha hayi ni pondindo cheppalenu :) naa chinnatanam gurtochindi...
Super Post ...
Me Kadhanika chala bagundi mastaru
ee sari me bongarala potillo Dharni annaya Bharani vastademo ani eduru chustu vuntam
బెదరు, అమ్మా వాళ్లకి కాకుండా అమ్మాయికి భయపడి, ఓడించాలెం అని డిసైడ్ అయ్యి గోలీలు మానుకున్నరేమో అని అనిపిస్తుంది, మరి ఎవరైనా బొంగారాల్లో కుడా తల దూరిస్తే ఎం చేసేవారు? ఇంతకీ మీ పేరు గోళి బ్రదర్స్ నుంచి బొంగు బ్రదర్స్ గా మార్చుకున్నారా? (తప్పుగా అనుకోవద్దు, తమాషాకి అన్న)
హ హ భలే రాసారండి.అనుకోకుండా ఈ పోస్ట్ చదివా :)
పాపం కదండీ..
ధరణి గారిని అన్యాయంగా గుద్దేశారు..
మంచి ఫ్లో లో రాసారు.. కామెడి పండించారు.
హా..హ్హా...హా...చాలా బాగా రాసారండి..ప్రతీ వాక్యం అదరగొట్టేసారు..
హా..హ్హా...హా...చాలా బాగా రాసారండి..ప్రతీ వాక్యం అదరగొట్టేసారు..
పోన్లే బంతి, ఇన్నాళ్ళు భోషాణం లో ఉన్న నీ బ్లాగు బయటకు తీశావ్.. సంతోషం.. I'm very happy for that!
నీ గోళీకాయ కథ కూడా సూపర్.. అదిరింది.. లేటుగా చెప్పినా లేటేస్ట్ గా చెప్పాలని చెబుతున్నా.. too good bro!
Post a Comment